సర్ప్రైజ్ : సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన “యాత్ర 2”

సర్ప్రైజ్ : సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన “యాత్ర 2”

Published on Apr 12, 2024 2:17 PM IST


రీసెంట్ గా వచ్చిన బయోపిక్ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ పొలిటికల్ బయోపిక్ అందులోని సీక్వెల్ చిత్రం “యాత్ర 2” (Yatra 2 OTT) కూడా ఒకటి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) అలాగే కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు జీవా కలయికలో దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన చిత్రమే ఇది.

మరి దివంగత వై ఎస్ ఆర్ అలాగే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ల జీవితాల్లో జరిగిన పలు వస్తావ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కి వచ్చింది. మరి అప్పుడు నుంచి ఇపుడు సర్ప్రైజ్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం సైలెంట్ గా ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు