బ్యాంకాక్ వెళ్తున్న సూర్య, నయనతార..!

3rd, January 2015 - 11:00:48 PM

Nayanathara_surya
తమిళ స్టార్ హీరో సూర్య, నయనతార జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్’. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ ఇటివలే పూర్తయింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, పాటల చిత్రీకరణ బాలన్స్ ఉంది. త్వరలో మూవీ యూనిట్ బ్యాంకాక్ పయనమవుతారు. అక్కడ ఫైట్స్, సాంగ్స్ షూట్ చేయనున్నారు. బ్యాంకాక్ షెడ్యూల్ తో కంప్లీట్ షూటింగ్ ఫినిష్ అయిపోతుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్. కమెడియన్ ప్రేమ్ జీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ కొత్త సంవత్సరం కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.