జగన్ ది పెనుసవాళ్లతో కూడిన మహోన్నత విజయం-సూర్య

Published on May 29, 2019 9:26 am IST

స్టార్ హీరో సూర్య నిన్న హైదరాబాద్ లో “ఎన్ జి కె” మూవీ ప్రమోషన్ భాగంగా విలేకరులతో మాట్లాడారు. అదేసంధర్బంలో జగన్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో సాధించిన విజయాన్ని కొనియాడారు. జగన్ పదేళ్ల కష్టానికి ప్రతి ఫలం ఈ ఘనవిజయం అన్నారు. ఐతే ఈ విజయం జగన్ పై హిమాలయాలంత బరువైన బాధ్యతను మోపిందని, జగన్ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

లక్షల కోట్ల అప్పులు, లోటు బడ్జెట్ వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ప్రజారంజక పాలన చేయడం పెనుసవాళ్లతో కూడుకున్నదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ను సైతం పొగడ్తలతో ముంచెత్తారు సూర్య. తమిళనాడులో కూడా ఆయన కు అభినులున్నారన్నారు. ఆయనతో ఎప్పటికైనా ఓ మూవీ చేస్తానన్నారు. సూర్య కి జోడీ గా సాయి పల్లవి, రకుల్ నటించిన”ఎన్ జి కె” ఈ నెల 31న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More