ఈ సారైనా స్టార్ హీరోకి సక్సెస్ వస్తోందా ?

Published on May 30, 2019 9:00 pm IST

‘గజిని’, యముడు, సింగం లాంటి విభిన్న తరహా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు తమిళ్ స్టార్ హీరో ‘సూర్య’. అయితే గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద సూర్య కాస్త వెనకబడ్డాడు. మరి ఈ నేపథ్యంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా చేస్తోన్న ‘ఎన్.జి.కె’ చిత్రం రేపు భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

మరి ఈ సినిమాతోనైనా సూర్య తెలుగులో సక్సెస్ కొడతాడా.. ఇప్పటికే టాలీవుడ్ లో డల్ అయిపోయిన తన మార్కెట్ ను ‘ఎన్.జి.కె’తో పెంచుకుంటాడు. ‘ఎన్.జి.కె’ టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కంటెంట్ బాగానే ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే సినిమా మొత్తం పూర్తి రాజకీయ నేపధ్యం కావడం, పైగా కష్టాలు కన్నీళ్లు అంటూ ఎమోషనల్ గా సాగే ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు ఎంతవరకు ఎక్కుతుంది.. దీని బట్టే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భవితవ్యం తేలనుంది.

పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More