లంక నేపథ్యంలో సూర్య కొత్త సినిమా ?

Published on Nov 30, 2020 6:04 pm IST

తమిళ్ స్టార్ హీరో సూర్యకి చాలా సంవత్సరాలు తరువాత మంచి హిట్ వచ్చింది. డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉండటంతో.. సూర్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మరి ఇలాంటి సినిమా తీసిన తరువాత.. మళ్లీ ఎలాంటి సినిమాతో రావాలి. ఇప్పుడు ఇదే విషయాన్ని సూర్య తన తరువాత సినిమా డైరెక్టర్ కి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా సూర్య ఇప్పటికే యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. హరికి సూర్య ఈ సారి మనం కొత్తగా చేద్దాం అంటూ లంక ప్రాంతానికి సంబంధించిన ఓ ఐడియాని సూర్య, హారికి చెప్పినట్లు.. హరి ప్రస్తుతం ఆ ఐడియా పై వర్క్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరి కలయికలో పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పల్లెటూరి కథను సినిమాగా రాబోతుందని.. ఇప్పటికే ఇద్దరూ ఓ కథకు కూడా ఫిక్స్ అయ్యారంటూ ఆ మధ్య కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చినా.. అవి నిజం కాదని తేలిపోయింది.

మరి ఇప్పుడు లంక నేపథ్యంలో సినిమా అంటే.. కచ్చితంగా కొత్తగా ఉంటుంది. సూర్య గతంలో ఎన్నడూ అలాంటి సినిమా చేయలేదు. పైగా లంక నేపథ్యం పై తమిళ ప్రజలకు కాస్త ఆసక్తి ఎక్కువు ఉంటుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. కానీ, సూర్య ఫ్యాన్స్ మాత్రం గతంలో వీళ్లు చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని తరుచూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ వస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More