సూర్య మరోటి మొదలు పెట్టేస్తున్నాడు !

Published on Feb 3, 2019 10:41 pm IST

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా వున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల ‘ఎన్ జి కె’ చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘కాప్పాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం ఫైనల్ స్టేజ్ లో వుంది. ఇక ఈచిత్రం తరువాత సూర్య తన 38వ చిత్రంలో నటించనున్నాడు.

‘గురు’ ఫేమ్ సుధా కొంగర తెరకెక్కించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి చివర్లో ప్రారంభం కానుంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక అన్ని కుదిరితే ఈ మూడు సినిమాలతో ఈ ఏడాది ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ ను ఇచ్చే ఆలోచనలో వున్నాడు సూర్య.

ఇకఇదిలా ఉంటే ఎన్ జి కె టీజర్ కొరకు సూర్య ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ ఈనెల 14న విడుదలకానుంది.
సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :