జూలై 5న సూర్య, సమంతల ‘అంజాన్’ ఫస్ట్ టీజర్

జూలై 5న సూర్య, సమంతల ‘అంజాన్’ ఫస్ట్ టీజర్

Published on Jun 24, 2014 1:15 PM IST

anjana

తమిళ స్టార్ హీరో సూర్య, అందాల భామ సమంత హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా ‘అంజాన్’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో ముగిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 5న రిలీజ్ చేయనున్నారు. అదికూడా విజయ్ టీవీ అవార్డు నైట్స్ లో స్పెషల్ గా ప్రదర్శించనున్నారు. ఈ సినిమాపై సూర్య, తమిళ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కమర్షియల్ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాని తిరుపతి బ్రదర్స్ – యుటివి మోషన్ పిక్చర్స్ కలిసి నిర్మించారు. సూర్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 150 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ అధినేత లగడపాటి శ్రీధర్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు.

తాజా వార్తలు