
సినిమాలో మాస్ మెచ్చే ఫైట్స్ ఉండాలి, కామెడీ ఉండాలి అనే ఫార్మాట్ కి దూరంగా వచ్చి సినిమా అంటే ముందు కంటెంట్ లో కొత్తదనం ఉండాలి అని తెలుసుకున్న హీరోలలో యంగ్ హీరో నిఖిల్ ఒకరు. తను ఎంచుకున్న ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాల కాన్సెప్ట్ కొత్తగా ఉండడమే కాకుండా ప్రెజెంటేషన్ కూడా ఆడియన్స్ ని మెప్పించడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇదే తరహాలో నిఖిల్ ట్రై చేస్తున్న మరో సినిమా ‘సూర్య vs సూర్య’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఇటీవలే విడుదలై అందరి చేత సూపర్బ్ అనిపించుకుంది.
అంతే కాకుండా ఈ సినిమాలోని ఓ పూర్తి పాటని ఇటీవలే రిలీజ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ‘సూర్య vs సూర్య’ ఆడియోని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాని ఫిబ్రవరి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా మారుతున్న ఈ సినిమాలో త్రిదా చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది. సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

