అక్కినేని హీరో లుక్ కిరాక్ గా ఉందే..!

అక్కినేని హీరో లుక్ కిరాక్ గా ఉందే..!

Published on Jan 5, 2020 4:50 PM IST

sushanth

యంగ్ హీరో సుశాంత్ అల వైకుంఠపురంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. కథలో ప్రధానమైన ఓ పాత్ర కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సుశాంత్ ని తీసుకోవడం జరిగింది. అల వైకుంఠపురంలో బన్నీ సుశాంత్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ గా ఉంటాయట. అల వైకుంఠపురంలో మరో హీరోయిన్ గా నటిస్తున్న నివేదా పేతురాజ్ సుశాంత్ కి జోడిగా చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్కినేని హీరో సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోలు పంచుకున్నారు. స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన సుశాంత్ అల్ట్రా స్టైలిష్ లుక్ కిరాక్ గా ఉంది.

విజయాల పరంగా వెనుకబడ్డ సుశాంత్.. హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది. ఇటీవల ఈచిత్ర టైటిల్ పోస్టర్ విడుదల చేయగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. దర్శకుడు ఎస్ దర్శన్ ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని హరీష్ కోయల గుండ్ల, రవి శంకర్ శాస్త్రి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు