అక్కినేని వారసుడు సుశాంత్ – దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో తెరకేక్కబోయే సినిమాలో హీరోయిన్ గా కాథరిన్ త్రేసాను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ విజయం తర్వాత గాంధీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. శ్రీ నాగ్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇటివల తమిళంలో ‘మద్రాస్’ సినిమాతో విజయం అందుకున్న కాథరిన్, తెలుగులో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా ఆమె నటించిన ‘ఎర్రబస్సు’ సినిమా విడుదలకు సిద్దమయింది.


