“బాలయ్య 110” పట్ల సస్పెన్స్.!

“బాలయ్య 110” పట్ల సస్పెన్స్.!

Published on Feb 20, 2024 10:06 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరీర్ లో 109వ సినిమాని దర్శకుడు బాబీ తో ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ముందు హ్యాట్రిక్ విజయాలు ఉండడంతో బాలయ్య లైనప్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక బాలయ్య నెక్స్ట్ సినిమా అది కూడా 110వ సినిమాపై అయితే మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అఖండ పార్ట్ 2 లైన్ లోనే ఉంది కానీ ఇదే 110వ సినిమా అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

ఇక లేటెస్ట్ గానే స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా బాలయ్య తదుపరి సినిమా ఉంటుందని కొన్ని వచ్చాయి. ఇక ఇప్పుడు ఇదీ చాలదన్నట్టు మరో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా చేరాడంటున్నారు. ఇలా మొత్తంగా అయితే బాలయ్య కెరీర్ లో 110 వ సినిమా పట్ల మాత్రం ఇప్పుడు మంచి ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. మరి దీనిపై క్లారిటీ కాలమే డిసైడ్ చెయ్యాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు