
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న నటుల్లో ఉన్న సీనియర్ మరియు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన 36 ఏళ్ళ సినీ కెరీర్లో ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలు చేసారు. అలాగే ఆయన మన రాష్ట్రంలోని పలు రకాల యాసలని అనర్గళంగా మాట్లాడగలరు. గత 36 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ వస్తున్న కోట శ్రీనివాస్ పుట్టినరోజు ఈ రోజు.
ఈ సందర్భంగా ఆయన తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘నాకు రావు గోపాలరావుతో మంచి అనుబంధం ఉంది. మామూలుగా ఆయన డైలాగ్ డెలివరీ ఓ అద్భుతం. కానీ ఆయన నన్ను ‘నీ డైలాగ్ ఫైరింజన్ గంట మోతలా ఉంటుందయ్యా’ అనేవారు. ఆయనలాంటి వ్యక్తి అలా మెచ్చుకోవడం ఆయన సంస్కారం. అలాగే ఓ సందర్భంలో ‘నాగ భూషణం-రావు గోపాలరావు కలిస్తే కోట’ అని ఇచ్చిన కితాబుని ఎప్పటికీ మర్చిపోలేనని’ కోట అన్నారు.
‘నాకు బాగా ఇష్టమైన నటుడు. ఆయన పెద పాత్రలు వేసిన ఆయనలో రాజసం కనపడుతుంది. రాబోవు తరానికి గొప్ప నట గ్రందాలయం ఎస్వీర్ గారని’ కోట అన్నాడు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయనకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

