దాదాపు సంవత్సర కాలం నుండి వెంకటేష్, అభిమానులు, మహేష్ బాబు అభిమానులే కాకుండా సాధారణ సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక మల్టిస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలకు ముస్తాబవుతోంది. సినిమా విడుదలకు ముందుగా జరిగే ఆడియో విడుదల కార్యక్రమం సాధారణ ఆడియో విడుదల లాగా కాకుండా విభిన్నంగా చేయబోతున్నారు. తెలుగుతనానికి సంభందించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో బుర్ర కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా లాగే వేడుకను కూడా సంప్రదాయాలను గుర్తుచేయడానికి ఈ విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పనుల్లో బిజీగా చిత్ర బృందం ఆడియో విడుదల తరువాత ఒక పాట చిత్రీకరణ కోసం కేరళ వెళ్లనుంది. వెంకటేష్, అంజలి మీద ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తారు. ఈ పాటతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు.
సంప్రదాయబద్ధంగా సీతమ్మ వాకిట్లో .. ఆడియో
సంప్రదాయబద్ధంగా సీతమ్మ వాకిట్లో .. ఆడియో
Published on Dec 14, 2012 8:32 AM IST
సంబంధిత సమాచారం
- చిరు టు బాలయ్య.. రౌండ్స్ కొడుతున్న డైరెక్టర్..?
- ల్యాండ్‌మార్క్ కోసం కింగ్ ఆరాటం..!
- అల్లు అర్జున్ కోసం అట్లీ వెరైటీ టైటిల్..?
- టాలీవుడ్లో క్రేజీ లైనప్‌తో KVN ప్రొడక్షన్స్..!
- రియల్ స్టంట్స్ మోడ్‌తో మళ్లీ ట్రెండింగ్ అవుతున్న మంచు మనోజ్
- శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. నెక్స్ట్ ఏం చేస్తాడో..?
- బాలయ్య 112 మూవీ పై కొత్త బజ్..!
- పిక్ టాక్ : మెహందీ ఫంక్షన్ స్పెషల్ ఫోటోను షేర్ చేసిన రష్మిక..!
- ‘వృషకర్మ’కు భారీ డీల్.. జాక్‌పాట్ కొట్టిన చైతూ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
- జీరో కట్స్ తో ‘ఉస్తాద్’ సెన్సార్ పూర్తి.. ఇక ఊచకోతే!
- ‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- మాస్ మోడ్ లో పవర్ స్టార్.. ‘ఉస్తాద్’ నుంచి నెక్స్ట్ సాంగ్ కి డేట్ వచ్చేసింది!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎనర్జిటిక్ గా నెక్స్ట్ సాంగ్ ప్రోమో! ఫుల్ సాంగ్ కి టైం ఖరారు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?
- ‘జైలర్ 2’ లో షారుఖ్ రోల్ పై క్లారిటీ!?


