
తెలుగులో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాగా వరుసగా రెండు హిట్స్ అందుకున్న తెలుగమ్మాయి స్వాతి. ఇలా వరుసగా హిట్స్ వచ్చినా స్వాతికి తెలుగులో మాత్రం ఆఫర్స్ తక్కువగా వస్తున్నాయి. కానీ తెలుగులో ఆఫర్స్ రాకపోయినా తమిళ, మళయాళ భాషల్లో మాత్రం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజగా స్వాతికి తెలుగులో పంజా సినిమా అందించిన విష్ణు వర్ధన్ డైరెక్టర్ గా చేస్తున్న తమిళ సినిమాలో చాన్స్ వచ్చింది.
ఆర్య, క్రేష్ణ, దీప సన్నిది ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ‘యాట్చన్’ అనే టైటిల్ ని పెట్టారు. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. స్వాతి కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. యుటివి మోషన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని మే లో రిలీజ్ చేయనున్నారు.