‘సైరా’ ఎఫెక్ట్ నుండి తప్పించుకోలేకపోయిన ‘చాణక్య’

‘సైరా’ ఎఫెక్ట్ నుండి తప్పించుకోలేకపోయిన ‘చాణక్య’

Published on Oct 6, 2019 12:40 PM IST

Syeraa Chanikya

ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘సైరా’ చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంటే ఆ ప్రభంజనంలో నిన్న విడుదలైంది ‘చాణక్య’. గోపిచంద్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తిరు డైరెక్ట్ చేశారు. మొదటి నుండి అనుకున్నట్టే ‘సైరా’ ప్రభావం ఈ చిత్రం మీద చాలా వరకు పడింది.

అందువలనే గోపిచంద్ గత చిత్రాల కంటే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న వీకెండ్ కావడంతో సాధారణంగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా పెద్ద చిత్రమైన ‘సైరా’ వైపే అడుగులు వేశారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం పెరిగిన ‘సైరా’ వసూళ్లే ఇందుకు సాక్ష్యం.

దీంతో ‘చాణక్య’కి నైజాంతో పాటు అన్ని ఏరియాల్లో పూర్ స్టార్ట్ కనబడింది. పైగా వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అంతంతమాత్రంగానే ఉండటం చిత్రానికి మరొక డ్రాబ్యాక్.

తాజా వార్తలు