‘అల్లూరి సీతారామరాజు’గా మెగాస్టార్ చిరంజీవి !
Published on Nov 13, 2018 8:55 am IST

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే, జార్జియాలో జరుపుకున్న లాంగ్ షెడ్యూల్ లో చిత్రబృందం కీలక సన్నివేశాలతో పాటు భారీ యుద్ధ సన్నివేశాలను కూడా చిత్రీకరించింది

అయితే, ప్రస్తుతం హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్న సన్నివేశాలు మాత్రం చాలా ఎమోషనల్ గానూ.. సినిమాకే హైలెట్ గానూ నిలుస్తాయట. ఈ సన్నివేశాల్లోనే మెగాస్టార్‌ చిరంజీవి అల్లూరి సీతారామరాజు గెటప్ లో కూడా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యం ఊరి తీసిన తరువాత… ఆ తర్వాత కాలంలో నరసింహ రెడ్డి స్ఫూర్తితో మళ్లీ బ్రిటిష్ సైన్యం పై
ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా.. ఆ తర్వాత కాలంలో వచ్చిన కొంతమంది విప్లవకారులను ఈ చిత్రంలో చూపించనున్నారు.

ఆ విప్లవకారుల గెటప్స్ లోనూ మెగాస్టారే కనిపిస్తారట. అలాగే అల్లూరి సీతారామరాజు గెటప్ లోనూ మెగాస్టార్‌ ప్రత్యేకంగా కనిపించనున్నారు. ఇదే ఈ చిత్రానికి క్లైమాక్స్ అని కూడా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయకులుగా నటిస్తోన్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • 118
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook