‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడనుందా?

‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడనుందా?

Published on Sep 17, 2019 1:03 AM IST

Syeraa1

‘సైరా’ కోసం మెగా టీమ్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించడానికి సిద్దమయ్యారు. మొదట ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ నగరంలోనే ఈ నెల 18న జరపాలని డిసైడ్ అయ్యారు. ఉదయం వరకు ఈ తేదీనే అనుకున్న మేకర్స్ కొద్దిసేపటి క్రితమే వేడుకను వాయిదా వేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఈ నెల 22న వేడుకను జరపాలని చూస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే 18న ట్రైలర్ విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ సినిమా యొక్క హిందీ వెర్షన్ ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. అక్టోబర్ 2నాటికి విడుదలకు రెడీగా ఉండేందుకు విఎఫ్ఎక్స్ పనులను చకచకా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు