‘సైరా’ రన్ టైమ్ పెద్దదే.. అయినా ఇబ్బంది లేదు

‘సైరా’ రన్ టైమ్ పెద్దదే.. అయినా ఇబ్బంది లేదు

Published on Sep 23, 2019 9:58 PM IST

syeera6

అక్టోబర్ 2వ తేదీన విడుదలకానున్న ‘సైరా’ చిత్రంపై మెగా అభిమానుల్లో ఎంతటి భారీ హోప్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. తాజా సమాచారం మేరకు సినిమా రన్ టైమ్ 2 గంటల 44 నిముషాలని తెలుస్తోంది. ఈ రన్ టైమ్ కొద్దిగా ఎక్కువే. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఏవీ మిస్సవకుండా చూపించాలి కాబట్టి ఇంత రన్ టైమ్ అవసరమని భావించారట టీమ్.

ఈమధ్య ప్రేక్షకులు సైతం సినిమా బాగుంటే 3 గంటల రన్ టైమ్ అయినా పెద్ద విషయం కాదని అంటున్నారు. సో.. సైరాకు రన్ ఇబ్బంది లేదు. ఇక టీమ్ సైతం సినిమాలో అన్ని రకాల అంశాలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. సుమారు రూ.270 కోట్ల వ్యయంతో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాపై చిరు సైతం బోలెడు ఆశలు, అంచనాలతో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు