సైరా షూటింగ్ అప్డేట్ !

Sye Raa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం కోకాపేట లో ప్రత్యేకంగా వేసిన బీదర్ కోట సెట్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో చిరు , సుధీప్ , విజయ్ సేతుపతి తో పాటు ఇతర తారాగణం పాల్గొంటుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఈనెల 9నుండి ప్రారంభం కానుంది.

ఏప్రిల్ చివర్లో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి తరువాత విఎఫ్ఎక్స్ కోసం చాలా సమయాన్ని కేటాయించనున్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.

Exit mobile version