బరిలోకి మరొక భారీ చిత్రం.. ‘సైరా’ టీమ్ వేగం పెంచాలి

బరిలోకి మరొక భారీ చిత్రం.. ‘సైరా’ టీమ్ వేగం పెంచాలి

Published on Sep 26, 2019 1:08 AM IST

syeraa4

రామ్ చరణ్ ‘సైరా’ చిత్రాన్ని తెలుగుతో సమానంగా హిందీలో విడుదల చేసి, తండ్రి చిరు స్థాయిని హిందీ పరిశ్రమలో పెద్ద ఎత్తున నిలబెట్టాలనుకున్నారు. అందుకోసం మొదటి నుండి అక్కడి చిత్ర వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. కానీ విడుదలకు ఇంకో 6 రోజులే వ్యవధి ఉందనగా ఇప్పటికీ ప్రమోషన్లు మొదలుపెట్టలేదు.

మరోవైపు 2వ తేదీ హిందీ బాక్సాఫీస్ ముందు తీవ్రమైన పోటీ ఉండనుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ ‘వార్’ భారీ ఎత్తున విడుదలకానుంది. దాంతో పాటే హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ కూడా అదే రోజున రానుంది. హిందీలో మంచి క్రేజ్ ఉన్న ఈ చిత్రాన్ని మొదట 4వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుని ఇప్పుడు అనూహ్యంగా 2వ తేదీకి తీసుకోస్తున్నారు.

ఈ రెండు చిత్రాలకు భారీ సంఖ్యలో థియేటర్ల కేటాయింపు ఉంటుంది. ‘సైరా’ విపరీతమైన పోటీ తప్పదు. కాబట్టి చిత్ర టీమ్ త్వరగా ప్రచార కార్యక్రమాల్ని స్టార్ట్ చేసి ‘ట్రైలర్’ ద్వారా తెచ్చుకున్న క్రేజ్, అంచనాల్ని పెంచుకుంటూ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం తక్షణమే చేయాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు