‘సాహో’ని చూసి ‘సైరా’ మేకర్స్ జాగ్రత్తపడుతున్నారట

Published on Sep 11, 2019 6:34 pm IST

కొన్ని రోజుల క్రితం భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘సాహో’ అంచనాలకు తగ్గట్టు ఫలితాన్ని అందుకోలేక పోయిన సంగతి తెలిసిందే. సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఫలితంగా ఓపెనింగ్స్ అయితే భారీగానే వచ్చాయి కానీ లాంగ్ రన్ వసూళ్ల మీద ఎఫెక్ట్ పడింది.

దీంతో ‘సైరా’ బృందంలో అలజడి మొదలైంది. తమది కూడా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ‘సాహో’ విషయంలో జరిగిన పొరపాటు తమ సినిమా విషయంలో జరగకూడదని జాగ్రత్త పడుతున్నారట. అన్ని అంశాలను పలుసార్లు చెక్ చేసుకుంటున్నారట. చిరు, చరణ్, సురేందర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తూ నమ్మకమైన వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళుతున్నారట. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More