‘సైరా’ క్లైమాక్స్ మార్చారట ?

Sye Raa1

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని కల్పనలను కూడా జోడిస్తున్నారట. అయితే క్లైమాక్స్ విషయంలో చిత్రబృందం చాలా రకాలుగా ఆలోచించి చివరికి ఓ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా వాస్తవం ఆధారంగా సినిమాని తీస్తే.. సాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాలి. ఎందుకంటే నరసింహరెడ్డిని బ్రిటిష్ సైన్యం ఊరి తీసి కోట గుమ్మానికి ఆయన తలను వేలాడి తీసింది. ఈ విషయంతోనే క్లైమాక్స్ తీస్తే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ పడతారని భావిస్తోన్నారు దర్శక నిర్మాతలు.

అందుకే నరసింహ రెడ్డి చావుతో కాకుండా నరసింహ రెడ్డి స్ఫూర్తితో … మళ్లీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా ఆ తర్వాత కాలంలో వచ్చిన కొంతమంది విప్లవకారులను చూపించనున్నారని సమాచారం. అంటే అల్లూరి సీతారామరాజు కాలం నాటి విప్లవకారులన్నమాట. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version