లేటెస్ట్ సైరా యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్.

లేటెస్ట్ సైరా యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్.

Published on Oct 14, 2019 7:05 PM IST

సైరా వసూళ్ల పరంగా మరో మైలురాయిని చేరుకుంది. యూఎస్ లో $2.5 మిలియన్ మార్కు చేరుకొని అబ్బురపరిచింది. దీనిపై సైరా యూఎస్ విడుదల హక్కులను సొంతం చేసుకున్న స్నో ఫ్లేక్ సినిమాస్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ పీరియాడిక్ పేట్రియాటిక్ విజువల్ వండర్ రికార్డ్ వసూళ్లు సాధిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణా, ఉత్తరాంధ్ర ఏరియాలలో సైరా వసూళ్లు పటిష్టంగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలలో సైరా లాభాలలోకి ప్రవేశించినట్లు సమాచారం.ఐతే యూఎస్ లో బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకా సైరా చాలా వసూళ్లు సాధించాలి.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ సరసన నయనతార, తమన్నా నటించిన ఈ చిత్రంలో అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. ఈ మూవీ కి సంగీతం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు