సైరా విడుదలకు ఇంకా కేవలం ఐదురోజులు మాత్రమే మిగిలివుంది. సైరా పై రాష్ట్ర వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్నప్పటికీ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న చిత్రానికి దేశవ్యాప్త ప్రచారం చాలా అవసరం. సైరా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అవగాహన ఉన్నప్పటికీ ఇది సరిపోదు. మూవీ ఎలా ఉన్నా భారీ హైప్ మధ్య విడుదలైన చిత్రాలకు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించడానికి ఉపయోగపడతాయి. సాహో చిత్రం ఇందుకు చక్కని ఉదాహరణ. విడుదలైన మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా రికార్డ్స్ సాధించింది అంటే అది కేవలం, మూవీపై క్రియేట్ అయిన బజ్ ప్రభావమే.
మరి సైరా సాహో రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తుందా అంటే అనుమానమే. సైరా టీం ఇతర భాషలలో ప్రచారం పై ఇంకా కొంచెం ద్రుష్టి పెడితే మంచి ఫలితాలు దక్కే అవకాశం కలదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మూవీని ప్రోమోట్ చేయడం చాలా అవసరం. వార్ లాంటి భారీ చిత్రంతో అక్కడ పోటీ పడుతున్న సైరా కి పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. హిందీ వెర్షన్ విడుదల హక్కులు దక్కించుకున్న హీరో ఫర్హాన్ అక్తర్ కి చెందిన ఎక్సల్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరియు ఏ ఏ ఫిలిమ్స్ సైరా ప్రొమోషన్స్ ని ఇంకొంచెం ప్రభావవంతంగా నిర్వహిస్తే మంచింది.


