
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రావడం ఊపందుకున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలయినా స్టార్ హీరోల సినిమాల మాదిరిగానే రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే చెయ్యడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ ఢిల్లీ బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి తాప్సీ మాత్రం నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి సిద్దంగా లేనని అంటోంది.
ఈ విషయంపై తాప్సీ స్పందిస్తూ ఎన్. హెచ్10, మేరీ కామ్, తను వెడ్స్ మను, కహాని మొదలైన సినిమాలు చేయాలి అంటే స్టార్ పవర్ ఉండాలి. నాకు ఇంకా అంత స్టార్ పవర్ లేదు. కానీ త్వరలోనే నేను కూడా ప్రియాంక చోప్రా, విద్యా బాలన్, కంగన రనౌత్, అనుష్క శర్మ మొదలైన స్టార్ హీరోయిన్స్ లీగ్ లో చేరతాను. అలాగే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలంటే సినిమా మొత్తాన్ని నేనే కారీ చెయ్యాలి. అలా చెయ్యడానికి నాకు ఇంకాస్త అనుభవం కూడా కావాలని తెలిపింది. తాప్సీ నటించిన గంగ సినిమా సమ్మర్ కానుకగా వచ్చి పెద్ద సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం తాప్సీ తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

