
టాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ, చెన్నైకి చెందిన ఓ రొమ్ము క్యాన్సర్ అవగాహన సంస్థకు బ్రాండ్ అంబాసడర్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్ లు సామజిక సేవలు చేయడానికి ముందుకు వస్తున్నారు. హీరో నాగార్జున సతీమణి అమల మరియు సమంత సామాజిక సేవా సంస్థలలో బిజీగా ఉన్నారు. తాప్సీ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసడర్ గా మరీనా సంగతి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.
తాప్సీ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఐశ్వర్య ధనుష్ తీస్తున్న ‘వైర్ రాజ వై’ సినిమాలో తాప్సీ ఒక భిన్నమైన పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారా అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, ఒక ఒంటరి అమ్మాయిగా నటిస్తున్నాను కానీ అది విలన్ పాత్ర కాదని తెలిపింది.

