మనలో విషయం ఉంటేనేగా ట్రోల్స్ చేస్తారు-తాప్సి

Published on May 30, 2020 1:00 am IST

హీరోయిన్ తాప్సి కెరీర్ జెట్ స్పీడ్ తో వెళుతుంది. బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడుకి అక్కడ స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకున్నా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో వరుస బెట్టి నటిస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తున్న తాప్సి మరో కంగనా రనౌత్ వలె ఎదుగుతుంది. అందరూ హీరోయిన్స్ వలె తాప్సికి కూడా ట్రోల్స్ బాధ వుంది. మరి ఆమెపై వచ్చే ట్రోల్స్ కి తాప్సి స్పందన ఇలా ఉంటుందట.

తనపై సోషల్ మీడియా వేదికగా వచ్చే ట్రోలింగ్ గురించి తాజాగా తాప్సీ స్పందించిందన తెలిపింది. ‘నన్నెవరైనా ట్రోల్ చేస్తే నేను బాధపడను. ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఆస్వాదిస్తా. ఎందుకంటే మనలో మేటర్ ఉంటేనే కదా అందరూ మన దృష్టి పెడతారు. అప్పుడే మనం చేసే ప్రతి పనినీ విమర్శిస్తారు. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమే’ అని తాప్సీ చెప్పింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిన కూడా సినిమాలు చేయాలనుకుంటున్నానని, అయితే అక్కడి నుంచి మంచి పాత్రలు రావడం లేదని చెప్పింది.

సంబంధిత సమాచారం :

More