సీనియర్ నటి టబు, ప్రస్తుతం కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘King100’ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల షూటింగ్ విరామ సమయంలో సెట్స్‌పై తన తోటి నటీనటులతో కలిసి దిగిన సరదా ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.
ఈ చిత్రంలో టబు పోషించే పాత్రపై చిత్ర యూనిట్ ఇంకా గోప్యత పాటిస్తున్నప్పటికీ, ఆమె నటనపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘King100’ ఒక సామాన్యుడు గొప్ప స్థాయికి ఎదిగే ‘ర్యాగ్స్-టు-రిచెస్’ కథాంశంతో రూపొందుతోంది. ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుస్మితా భట్ మరియు విజయేంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. అక్కినేని నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పై ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. నాగ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


