‘రాయన్’ నుండి టాలెంటెడ్ యాక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్

‘రాయన్’ నుండి టాలెంటెడ్ యాక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Published on Feb 21, 2024 10:38 PM IST

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఆయన డ్రీం ప్రాజక్ట్ రాయన్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి ప్రసంశలు దక్కాయి. ఎస్‌ జె సూర్య, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఓం ప్రకాశ్‌ డీవోపీగా అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ నుండి ఎస్ జె సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆయన స్టైలిష్ గా కుర్చీలో కూర్చుని ఉన్న ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ ని ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు