సస్పెన్స్ థ్రిల్లర్ తో రానున్న టాలెంటెడ్ డైరెక్టర్ ?

chandra

లాక్ డౌన్ ముందువరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రం చేస్తున్నాడు నితిన్. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేయనున్నాడట. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలోనే ఉంటుందట. ఇక నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ’ భారి స్థాయిలో ఆకట్టుకోని సూపర్ హిట్ అయింది.

దాంతో నితిన్, ఆ సక్సెస్ ను కొనసాగించాడానికి తన తదుపరి సినిమాల పై మరింత దృష్టి పెట్టారు. మరి ఈ ‘చదరంగం’ చిత్రంతో కూడా నితిన్ మరో సూపర్ హిట్ ఆయనకు దక్కుతుందేమో చూడాలి. అన్నట్టు ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్. కాగా నితిన్ కొద్దిరోజుల క్రితం తన చిరకాల ప్రేయసి శాలినితో నిశితార్థం చేసుకున్నారు. ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాలనుకున్నా… క‌రోనా కారణంగా అది కుదరలేదు. ఆ తరువాత త‌న పెళ్లిని డిసెంబ‌ర్‌ కు వాయిదా వేశారు.

Exit mobile version