టాక్ : నాగచైతన్య – కార్తీక్ దండు మూవీకి భారీ ప్లానింగ్స్ ?

టాక్ : నాగచైతన్య – కార్తీక్ దండు మూవీకి భారీ ప్లానింగ్స్ ?

Published on May 1, 2024 1:02 AM IST

యువ నటుడు నాగచైతన్య హీరోగా ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక దీని అనంతరం ఇటీవల సాయి తేజ్ తో విరూపాక్ష వంటి హర్రర్ థ్రిల్లర్ తెరకెక్కించి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న కార్తీక్ దండుతో చేయనున్నారు చైతు.

ఈ మూవీ గురించి ఇప్పటికే పలు వార్తలు కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మిథికల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారట. అలానే అజనీష్ లోకనాథ్ సంగీతం అందించనున్న ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో ప్రారంభం కానుండగా మూవీ కోసం గ్రాండ్ గా ప్లానింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయట. కాగా ఈ మూవీని 2026లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రచనలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు