టాక్.. “ఇండియన్” కోసం “గేమ్ చేంజర్”?

టాక్.. “ఇండియన్” కోసం “గేమ్ చేంజర్”?

Published on Apr 28, 2024 2:00 PM IST

ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ ఇపుడు రెండు భారీ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. మరి వాటిలో లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తో చేసిన భారీ చిత్రం “ఇండియన్ 2” ఒకటి కాగా మరో చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో దాదాపు పూర్తి కావచ్చిన చిత్రం “గేమ్ చేంజర్”. అయితే వీటిలో ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్ సమయాన్ని ఫిక్స్ చేసుకుంది.

ఈ జూన్ లో బ్రహ్మాండమైన రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ కోలీవుడ్ వర్గాలు నుంచి వినిపిస్తుంది. తమిళ సినిమా నాట ఇప్పటికీ ఆడియో వేడుకనే చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇండియన్ 2 కి గ్రాండ్ గా ఆడియో లాంచ్ ని ఈ మే నెలలో ప్లాన్ చేస్తుండగా ఈ ఈవెంట్ గాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్టుగా వినిపిస్తుంది.

మరి ఈ క్రేజీ బజ్ ఎంతవరకు నిజం అవుతుంది అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కాజల్, రకుల్, సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు