మాస్ మహారాజా హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దెబ్బతో టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా అందించని పెద్ద ఎత్తున లాభాలను డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చూశారు.
ఇక ఈ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో రవితేజ తన నెక్స్ట్ సినిమాలో విషయంలో మరింత జాగ్రత్తగా అదే విధంగా డిమాండ్ కూడా పెంచినట్టు తెలుస్తుంది. రవితేజ ఇరుముడి సినిమాకి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నైజాం హక్కుల మాత్రమే తీసుకున్నట్టు టాక్ ఉంది. దీంతో నైజం లో భారీ లాభాలు చూసిన రవితేజ తన నెక్స్ట్ సినిమాలకి డైరెక్ట్ గా రెమ్యునరేషన్ గానే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈసారి చేయనున్న సినిమాలకి 30 కోట్లకు పైగానే తన పారితోషకం చెబుతున్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. రవితేజ నిజమైన పొటన్షియల్ కి సరైన హిట్టు తగిలితే ఎలా ఉంటుందో ఇరుముడి చూపించింది. సో తను హీరోయిన్ డిమాండ్ చేసిన ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
