‘సిగ్మా’ ట్రైలర్ లాంచ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సిగ్మా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి మేకర్స్ బిగ్ అప్‌డేట్‌ను అందించారు. ఈ సినిమా గ్రాండ్ ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 18న అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తుండటంతో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. ఈ సినిమాని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version