కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్..!

భారతీయ సంగీత శిఖరం, గానకోకిల ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా నేడు చెన్నైలో పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

లెజెండ్రీ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టి ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు. గత ఏడాది కాలంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను నిర్మించే అవకాశం రావడం తమకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ మరియు రాక్‌లైన్ వెంకటేష్ తెలిపారు. లాంచ్ ఈవెంట్‌లో సాంప్రదాయ చీరకట్టులో మెరిసిన రష్మిక మందన్న, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి మహోన్నతమైన వ్యక్తి పాత్రను పోషించే అవకాశం ఇచ్చినందుకు మేకర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ విజువల్ అండ్ మ్యూజికల్ వండర్‌ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version