టాక్.. “కల్కి 2898ఎడి” ట్రీట్ కల్కి మీద కాదా!?

టాక్.. “కల్కి 2898ఎడి” ట్రీట్ కల్కి మీద కాదా!?

Published on Apr 21, 2024 7:02 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో ప్రపంచ స్థాయి చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా కూడా రూపొందుతుండగా దీనిని దర్శకుడు నాగ్ అశ్విన్ తన విజన్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇవాళ సాయంత్రం ఓ ట్రీట్ వస్తున్నట్లు నిన్న మేకర్స్ సాలిడ్ అప్డేట్ ద్వారా ఖరారు చేశారు.

అయితే చాలా మంది కల్కి అవతారం ప్రభాస్ మీద ఊహించవచ్చు కానీ ఇది ఒక ఇంట్రోలా లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ పై ఉంటుంది అని టాక్. అలాగే దీనితోనే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా క్లారిటీ రాబోతుంది అని సమాచారం. ఇక ఈ భారీ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ అలాగే దీపికా, దిశా పటాని లు కూడ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వైజయంతి మూవీస్ వారు ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు