“పోతురాజు”గా ఇరగదీసిన నందు.!

“పోతురాజు”గా ఇరగదీసిన నందు.!

Published on Sep 3, 2020 10:40 PM IST

Nandu

పలు చిత్రాల్లో కొన్ని కీలకమైన రోల్స్ చెయ్యడమే కాకుండా హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందు. తన లాస్ట్ చిత్రం “సవారి”తో నటునిగా మరో మెట్టు పైకెక్కిన ఈ యువ హీరో నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం “బొమ్మ బ్లాక్ బస్టర్”. ఈరోజు నందు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో నందు రోల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. మాస్ కా దాస్ ఫలక్ నామా దాస్ హీరో విశ్వక్ సేన్ చే విడుదల కాబడిన ఈ పోస్టర్ కు ఇపుడు మంచి రెస్పాన్స్ వస్తుంది.

“పోతురాజు”గా నందు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టుగానే మంచి మాస్ లుక్ లో దర్శకుడు పూరి అభిమానిగా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే ఈ రోల్ కూడా మంచి ఛాలెంజింగ్ గానే ఉండేలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తుండగా రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ పగడాలా, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది మరియు మనోహర్ రెడ్డి ఈడ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు