వైవిధ్యంగా అనిపిస్తున్న “వి”.!

వైవిధ్యంగా అనిపిస్తున్న “వి”.!

Published on Aug 26, 2020 11:40 AM IST

V The 2

ఇపుడు నాచురల్ స్టార్ నాని మరియు మూవీ లవర్స్ ఎంతగానో ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “వి”. నానితో పాటుగా సుధీర్ బాబు కూడా మరో మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ చిత్రం డిజిటల్ గా విడుదల చేయనున్నామని ప్రకటించిన దగ్గర నుంచి ఓ రేంజ్ హైప్ వచ్చింది. ఇక అక్కడ నుంచి ఈ చిత్రం ట్రైలర్ కోసం మన వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక అదే క్రమంలో ఇపుడు అమెజాన్ ప్రైమ్ వారు ట్రైలర్ ను విడుదల చేసేసారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే క్లుప్తంగా ఒక మాటలో చెప్పొచ్చు. ఈ ట్రైలర్ వైవిధ్యంగాను అందులోను ఊహించని విధంగా ఉందని చెప్పాలి. అయితే ఇంతకు ముందు విడుదల కాబడిన టీజర్ ను గమనిస్తే ఈ చిత్ర దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కేవలం ఒక క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ను మాత్రమే తీస్తున్నారనిపించి ఉండొచ్చు.

కానీ దానికి యాక్షన్ అనే మరో పదాన్ని యాడ్ చెయ్యడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ట్రైలర్ మొత్తంలో చూపించిన యాక్షన్ సీక్వెన్సులు కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి హైలైట్ అయ్యింది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ వి నిరాశ పరిచేలా లేదని చెప్పొచ్చు.

ట్రైలర్ కోసం క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు