టాక్.. ప్రభాస్ “కల్కి” కూడా వాయిదా?

టాక్.. ప్రభాస్ “కల్కి” కూడా వాయిదా?

Published on Jan 24, 2024 7:03 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి అత్యున్నత ప్రమాణ విలువలతో మన టాలీవుడ్ నుంచి ఒక నెవర్ బిఫోర్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమా ప్రభాస్ గత చిత్రాల్లానే ముందు పలు వాయిదాలు పడి మే 9 రిలీజ్ అంటూ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

కానీ ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా సినిమా తప్పుకుంటున్నట్టుగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ తదితరులు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు