మిత్రవింద కోసం భైరవ!?

మిత్రవింద కోసం భైరవ!?

Published on May 25, 2024 8:30 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ అండ్ చాలా మందికి ఇష్టమైన జంటల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి కాంబినేషన్ లో వచ్చిన “మగధీర”, “నాయక్” చిత్రాలు ఎంతగానో మెప్పించాయి.

ఇక వీటి తర్వాత వీరిద్దరూ మళ్ళీ ఫుల్ బిజీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తుండగా మరోసారి ఇద్దరినీ కలిపి చూసే అవకాశం ఫ్యాన్స్ కి రాలేదు. అయితే ఇప్పుడు తన మిత్రవింద కోసం భైరవ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కాజల్ నటించిన తన కెరీర్ స్పెషల్ ప్రాజెక్ట్ 60వ చిత్రం “సత్యభామ” కోసం అందరికీ తెలిసిందే.

మరి కాజల్ ఈ సినిమాని ఎంతో ప్రత్యేకంగా తీసుకోగా అగ్రెసివ్ ప్రమోషన్స్ ని కూడా ఆమె చేస్తుంది. నిన్ననే బాలయ్య ఈ సినిమా కోసం వచ్చారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కాజల్ కోసం రానున్నాడని తెలుస్తుంది. తన వంతుగా కాజల్ కి సినిమాకి సపోర్ట్ చేయనున్నాడని ఇప్పుడు టాక్. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు