టాక్ : ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఫిక్స్ ?

టాక్ : ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఫిక్స్ ?

Published on Apr 24, 2024 10:00 PM IST

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకుని కొనసాగుతున్న వారిలో వంశీ పైడిపల్లి కూడా ఒకరు. ఇటీవల కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ తో వారసుడు మూవీ తెరకెక్కించి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న వంశీ నెక్స్ట్ మూవీ పై కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ తో ఆయన తన నెక్స్ట్ మూవీ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే షాహిద్ కి వంశీ వినిపించిన స్టోరీ లైన్ ఎంతో నచ్చిందని, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి ఆ న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు