టాక్ : పోస్ట్ పోన్ కానున్న వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ ?

టాక్ : పోస్ట్ పోన్ కానున్న వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ ?

Published on Apr 14, 2024 2:11 AM IST


బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బేబీ జాన్. కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని ఏ కాళీశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ తేరికి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న బేబీ జాన్ మూవీ 2024 మే 31 న రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే ప్రొడక్షన్ కి సంబందించిన కొంత వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో అనుకున్న సమయానికి విడుదల అయ్యే ఛాన్స్ లేదని అంటున్నాయి లేటెస్ట్ బాలీవుడ్ వర్గాలు. నిజానికి మూవీకి సంబంధించి 10 రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, కాగా బేబీ జాన్ ని రానున్న జూన్ లేదా జులై లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వారు అంటున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మురద్ ఖేతని, ప్రియా అట్లీ, జ్యోతిదేశ్‌పాండే నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు