టాక్ : వెంకటేష్ 76 మూవీ అనౌన్స్ మెంట్ ఆరోజునే ?

టాక్ : వెంకటేష్ 76 మూవీ అనౌన్స్ మెంట్ ఆరోజునే ?

Published on Feb 27, 2024 12:33 AM IST

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ విజయాన్నిఅందుకున్నారు .ఇక దీని అనంతరం వెంకటేష్ ఎవరితో మూవీ చేస్తారు అనే దానిపై కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఆయన తదుపరి త్రివిక్రమ్ తో వర్క్ చేస్తారని అప్పట్లో వార్తలు రాగా రెండు రోజులుగా మీడియా మాధ్యమాల్లో వస్తున్న కథనాలని బట్టి తనతో ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్ తీసి మంచి సక్సెస్ లు అందించిన అనిల్ రావిపూడి తో వెంకటేష్ తన కెరీర్ 76వ మూవీ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క అనౌన్స్ మెంట్ మహా శివరాత్రి రోజైన మార్చి 8న రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా ఈ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు అదేరోజున వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు