ముంబై రోడ్లను శుభ్రపరిచిన తమన్నా..!

ముంబై రోడ్లను శుభ్రపరిచిన తమన్నా..!

Published on Nov 11, 2014 1:05 AM IST

Tamanna
మిల్కీ బ్యూటీ తమన్నా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ హీరో రామ్ తమన్నాను స్వచ్ఛ భారత్ కాంపెయిన్ లో పోల్గోనవలసిందిగా నామినేట్ చేశారు. హైదరాబాద్, ఎల్లారెడ్డి గూడాలోని ఒక ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలను అభిమానులతో కలసి శుభ్రం చేసిన అనంతరం సమంత, హన్సిక, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లకు రామ్ ఛాలెంజ్ విసిరారు.

రామ్ సవాల్ ను స్వీకరించిన తమన్నా.. సోమవారం నాడు ముంబైలో లోఖండ్ వాలా రోడ్లను శుభ్రపరిచారు. చీపురు పట్టి రోడ్లను ఊడ్చడంతో పాటు చేత్తో చెత్తను ఎత్తారు.

ప్రస్తుతం తమన్నా ఒక నెలరోజుల పాటు సినిమా షూటింగ్ లకు సెలవు పెట్టి ఇంట్లో సేద తీరుతుంది. మధ్యలో యాడ్ షూటింగ్ లలో పాల్గొనడంతో పాటు ఇలా సామాజిక కార్యక్రమాలలో పోల్గొంటుంది.

తాజా వార్తలు