నాజూకుదనానికి నిదర్శనంగా మారిన తమన్నా

Tamanna
తమన్నా ప్రస్తుతం కెరీర్ లోనే పీక్ దశలో వుంది. వచ్చే ఏడాది విడుదలకానున్న తన సినిమాల దృష్ట్యా తమన్నాకి రానున్న సంవత్సరం చాలా ముఖ్యమైనదని చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు ఆగడు, బాహుబాలి లో ప్రభాస్ సరసన నటిస్తుంది

ఈ సినిమాలలో అందంగా కనిపించడానికి తమన్నా కసరత్తులు మొదలుపెట్టింది. తరచూ వ్యాయామం చేయడం వలన తమన్నా ఇటీవల చాలా నాజుకుగా కనిపిస్తుంది. ఫెమినా పుస్తకం ముఖచిత్రంలో ఈ వయ్యారి అత్యంత అందంగా ఫోజులిచ్చింది

బాహుబలి సినిమాలో రాణిగా కనిపించనున్న ఈ భామ ఆ చిత్రంలో కొన్ని పోరాట సన్నివేశాలలో సైతం చెయ్యేసింది. మరి అత్యంత అందమైన తమన్నాని వెండితెరపై చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే

Exit mobile version