నాగార్జున – కార్తి సినిమాలో హీరోయిన్ గా తమన్నా..?

Tamanna
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేశారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం. అధికారికంగా దర్శకనిర్మాతల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది.

తెలుగులో నాగార్జున సరసన తమన్నా ఇప్పటివరకు నటించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇదే తొలి సినిమా అవుతుంది. కార్తి – తమన్నాలు తమిళంలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పైయ్యా’ (తెలుగులో ‘అవారా’గా విడుదలయింది), ‘సిరుత్తై’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమిళంలో కూడా సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతుందని ఆమెను తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version