వైరల్ అవుతోన్న తమన్నా ఫన్నీ వీడియో !

మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే ఆ వీడియోలో తమన్నా లుక్ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో తమన్నా ఎలా కనిపిచింది అంటే.. మూతికి మీసం పెట్టుకుని తమన్నా పాట పాడుతూ కనిపించింది. మొత్తానికి ఈ వీడియో నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. దీనికి ‘టాకింగ్‌ మాణిక్కం, వాకింగ్‌ మాణిక్కం, సింగింగ్‌ మాణిక్కం’ అంటూ సరదాగా షేర్‌ చేసింది తమన్నా.

ఇక ఈ వీడియో చూసిన ఆమె ఫాలోవర్స్‌, అభిమానులు తమన్నాకు ఫిదా అవుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వావ్‌ తమన్నా ఎంత ముద్దుగా ఉందో’, ‘మీసంతో అచ్చం మిక్కిమౌజ్‌లా ఉంది’, అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమన్నా యాక్షన్ హీరో గోపీచంద్‌ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో తమన్నా ‘జ్వాలారెడ్డి’గా నటిస్తోంది.

Exit mobile version