ఈ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో తమన్నా భాటియా!

ఈ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో తమన్నా భాటియా!

Published on Mar 1, 2024 12:00 PM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చివరిసారిగా తెలుగులో భోళా శంకర్ (తెలుగు)లో కనిపించింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ఆడియెన్స్ ముందుకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంకు సీక్వెల్ ను మేకర్స్ నేడు అనౌన్స్ చేయడం జరిగింది. సంపత్ నంది క్రియేట్ చేసిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు.

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓదెల రైల్వే స్టేషన్ ఆహా వీడియో లో ప్రారంభమైంది. మంచి రెస్పాన్స్‌ని సంపాదించి, ఇప్పుడు దాని సీక్వెల్‌కి రంగం సిద్ధమైంది. ఓదెల 2 అనే టైటిల్‌తో, ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ కానుంది. కాశీలో ఈరోజు చిత్రీకరణ ప్రారంభం కానుండగా, తమన్నా భాటియా ఇందులో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మధు క్రియేషన్స్‌కు చెందిన డి మధు, సంపత్ నంది టీమ్ వర్క్స్‌తో కలిసి ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. బి అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమన్నా భాటియా ఓదెల 2 తో మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు