తమన్నా లెవంత్ అవర్ రెడీ !

Published on Nov 22, 2020 1:18 am IST

ఇటీవలే కరోనా నుండి కోలుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా పాత వేగాన్ని అందుకుంది. కెరీర్లో ఎప్పుడూ ఖాళీగా ఉండని ఆమె కోవిడ్ కారణంగా షూటింగ్లకు దూరమైంది. ఇప్పుడుపూర్తిగా కోలుకోవడంతో కొత్త ప్రాజెక్ట్స్
ను చకచకా పూర్తి చేస్తోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘లెవంత్ అవర్ ‘ అనే వెబ్ సిరీస్ లో తమన్నా నటిస్తుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులను నటింపజేస్తున్నారట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది.

త్వరలో ఈ వెబ్ సిరీస్ ను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ప్రేక్షకులకు అందివ్వనుంది. దీనిని ప్రదీప్.యు నిర్మిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో ఈ చిన్నది చిందేసింది. ఇటీవల వచ్చిన మెగాస్టార్ సైరా సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది తమన్నా. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన సీటీమార్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా తో పాటు యంగ్ హీరో సత్యదేవ్ తో కలిసి శీతాకాలం అనే సినిమాలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More