హిందీలో ‘ఫనా, హమ్ తుమ్, తేరి మేరి కహాని’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు కునాల్ కోహ్లి తన తెలుగు ప్రాజెక్ట్ ను లండన్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఎన్నాళ్లగానో తెలుగులో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న కునాల్ కొహ్లీ ఈమధ్యనే ఈ కథను స్టార్ హీరోయిన్ తమన్నాకు చెప్పడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయి.
పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ చిత్రంలో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సచిన్ జోషి, అక్షయ్ పూరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరు, ఇతర విశేషాలేమిటి అనే వివారాలు ఇంకా తెలియాల్సి ఉంది.